సెల్ఫీ వీడియో కోసం ఓ యువకుడు చేసిన సాహసం చివరికి అతని ప్రాణం తీసింది.
సెల్ఫీ తీస్తూ అత్యంత విషపూరితమైన పాము పట్టాడు అది కాటేయడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలో జరిగింది .
పోచారం కాలనీలోని డబుల్ బెడ్రూం కాలనా సముదాయంలో నివాసముండే శివరాజ్ (20) జీవనోపాధి కోసం పాములు పడుతుంటాడు.
వృతి లో భాగంగా గురువారం సుమారు 2 మీటర్ల పొడువు ఉన్న నాగుపాము ను పట్టుకున్నాడు.
అంతవరకు బాగానే ఉంది కానీ సెల్ఫీ వీడియో కోసం పాము తలను నోట్లో పెట్టుకున్నాడు.
అంతే ఆ పాము ఒక్కసారి బుస కొట్టి నోట్లోనే విషం చిమ్మేసింది దీనితో అపస్మారక స్థితిలోకి వెళ్లిన శివరాజ్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు.
