HomeLaw and Orderప్రజా భవన్ లో నిర్వహించే ప్రజావాణి 11కు వాయిదా

ప్రజా భవన్ లో నిర్వహించే ప్రజావాణి 11కు వాయిదా

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో మహాత్మ జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 11వ తేదీకి వాయిదా వేశారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అర్జీలను స్వీకరించేందుకు ప్రతీ మంగళవారం, శుక్రవారం రాష్ట్ర స్థాయిలో ప్రజావాణి నిర్వహిస్తున్న విషయం తెలిసిందేనన్నారు.

అయితే ఈ నెల10న ప్రజాభవన్లో 16వ కేంద్ర ఆర్థిక సంఘంతో ముఖ్యమైన సమావేశం జరుగనున్న నేపథ్యంలో మంగళవారం నిర్వహించాల్సిన ప్రజావాణిని బుధవారానికి మార్చినట్టు ప్రజా పాలన ప్రత్యేక అధికారిణి దివ్య తెలియజేశారని అన్నారు.

కావున జిల్లా ప్రజలు ఈ మార్పును గమనించాలని కలెక్టర్ కోరారు. కాగా, జిల్లా స్థాయిలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని అన్నారు.

——————నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయనైనది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments