:కలిసి సంతోషంగా ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన స్నేహితుల ముందే తమ స్నేహితుడు గోదావరి ప్రవాహంలో గల్లంతైన ఘటన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద చోటుచేసుకుంది.
ఎస్సారెస్పీ గేట్లు ఎత్తివేయడంతో సందర్శనకు వచ్చిన ఓ యువకుడు గోదావరి ప్రవాహంలో కొట్టుకొని పోతుండగా రక్షించడానికి స్నేహితుడు చేసిన ప్రయత్నం విఫలమైంది.
ముంబాయికి చెందిన ఫేరోజ్ (28) తన బందువుల ఇంటికి జగిత్యాల జిల్లా మెట్ పల్లికి వచ్చినట్లు సమాచారం. స్నేహితులతో కలిసి ఎస్ఆర్ ఎస్ పి ప్రాజెక్టు చూడటానికి వచ్చి , ప్రమాదవశాత్తు గోదావరి నదిలో దిగి నీటి ప్రవాహంలో గల్లంతు అయ్యాడు.
స్నేహితుల ముందే ఫిరోజ్ కోట్టుకు పోవడంతో వారి అర్ధనాదాలు మిన్నంటాయి. సంఘటన స్థలానికి మెండోరా పోలీసులు చేరుకుని యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు గోదావరిలో యువకుడి గల్లంతైన ఫిరోజ్ అచూకి ఇంకా లభించలేదు.
