చెక్ డ్యాం లో పడి యువకుడు మృతి చెందిన ఘటన ఇందల్వాయి మండలంలో చోటు చేసుకుంది.ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.
మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గుర్రాల ప్రశాంత్(29).భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదివారం వ్యవసాయ పనులు నిమిత్తం వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళాడు.ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న పెద్దవాళ్ళు చెక్ డ్యాం లో పడి మృతి చెందినట్లు తెలిపారు.
భార్య రవళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపారు.
