డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ ఇద్దరికీ జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ సిఐ వీరయ్య తెలిపారు. వారి వివరాల ప్రకారం.
నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాల తనిఖీలు నిర్వహించగా మద్యం సేవించి వాహనం నడిపిన బోర్గం కు చెందిన చామకూర లక్పతి (43) ఇప్పటివరకు నాలుగు సార్లు పట్టుబడినట్లు తెలిపారు.
అలాగే నగరంలోని ఆదర్శనగర కు చెందిన రావుల మహేష్ (32)ఇతను కూడా ఇప్పటివరకు నాలుగు సార్లు పట్టుబడినట్లు పేర్కొన్నారు.
ఈ ఇద్దరినీ అదుపులోకి తీసుకొని జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ హైమద్ మోహినిద్దీన్ ముందు హాజరు పర్చారు. విచారణ అనంతరం ఇద్దరికీ రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ సిఐ వీరయ్య తెలిపారు.
