హుస్సేన్ సాగర్ లో ఈ ఏడాది గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి అనుమతి లేదని పోలీసు కమిషనర్, జీ హెచ్ ఎంసీ కమీషనర్ పేరుతో ఫ్లెక్సీలు ట్యాంక్ బండ్ మీద వెలిసాయి.
హైకోర్టు ఆదేశాల మేరకే ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లుగా ఆ ఫ్లెక్సీ లో పేర్కొన్నారు. ప్రతియేటావేలాది భారీ గణేష్ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడం ఆనవాయితీ గా వస్తుంది.
యంత్రాంగం సైతం సాగర్ చుట్టూ భారీఎత్తున క్రేన్ లను ఏర్పాటు చేస్తుంది. దాదాపు రెండు రోజుల పాటు నిమజ్జనం నేత్ర పర్వం గా సాగుతుంది ఈ ఉత్సవాలను తిలకించడానికి లక్షలాది మంది ట్యాంక్ బండ్ చుట్టూ గూమి గుడుతారు.
ఈసారి ఆంక్షలు అమలు చేయడానికి యంత్రాంగం సిద్ధం కావడం చర్చ నియాంశం అయింది మరో వారం రోజుల్లో నిమజ్జనం జరగనుంది
