ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతు…భారతదేశనికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం సిద్దిస్తే తెలంగాణ మాత్రం హైదరాబాద్ సంస్థానంగా నిజాం నిరంకుశ నిర్భంధంలో ఉందని ఆనాడు రజాకార్ల రాక్షస పాలనకు చరమగీతం పలికెందుకు బాంచన్ దొర అన్న చేతులు బంధుకులు పట్టి నిజాంకు ఎదురు తిరిగిన చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, షేక్ బంధాగి లాంటి వీరుల, వీరవనితల పోరాటాస్ఫూర్తితో భైరన్ పల్లి, కడవేండి, పరకాల పల్లెలు నిజాం రజాకార్ల ముకలను తరిమికొట్టిన చరిత్ర తెలంగాణ గడ్డది అని అన్నారు..స్వతంత్రం అనంతరం నిజాం తెలంగాణను భారతదేశంలో కలపను అవసరమైతే పాకిస్థాన్ లో కలుస్తాం అంటే ఆనాటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ కూడా భారతదేశంలో ఒక భాగమే అని ఆపరేషన్ పోలో నిర్వహించి పోలీస్ చర్య ధ్వరా నిజాం మెడలు వంచి నిజాం బానిస సంకెళ్లు తెంచి తెలంగాణకు స్వేచ్ఛ వాయువును అందించడం జరిగిందని అన్నారు..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ విమోచన దినన్ని అధికారికంగా నిర్వహించాలని కెసిఆర్ గారు డిమాండ్ చేసి ప్రతేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బ్రహ్మాండంగా అధికారికంగా నిర్వహిస్తాం అని గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో విమోచన దినన్ని అధికారికంగా నిర్వహించకుండా యావత్ తెలంగాణ ప్రజలను మోసం చేసి, తెలంగాణ అమరవీరుల ఆత్మలు గోషించే విందంగా ప్రవర్తించిన కెసిఆర్ కి తెలంగాణ ప్రజలు తగిన బుద్ది చెప్పడం జరిగిందన్నారు..గత ముఖ్యమంత్రి కెసిఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రజాకార్ల వారసులైన ఎం ఐ ఎం పార్టీ నాయకులకు బయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఓ వర్గం దగ్గర తాకట్టు పెట్టాలని చుస్తే ఊరుకోమని హెచ్చరించారు….కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అంటు తెలంగాణ అమరుల ఆత్మలు గోషించేలాగా కాకుంగా తెలంగాణ అమరుల ఆత్మలు శాంతించేల సెప్టెంబర్ 17ను విమోచన దినంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేయడం జరిగింది.
తెలంగాణ విమోచన దినన్ని అధికారికంగా నిర్వహించాలి -అర్బన్ ఎమ్మెల్యే.. ఇందూర్ నగరం :సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ ను డిమాండ్ చేసిన ..అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ..
RELATED ARTICLES
