సైబర్ నేరగాళ్ల వలలో పడి నగరంలోని రెండవ టౌన్ పరిధికి చెందిన ఓ వ్యక్తి డబ్బులు పోగొట్టుకున్నాడు. రెండో టౌన్ ఎస్ఐ యాసిర్ అరాఫత్ తెలిపిన వివరాల ప్రకారం ..
నగరంలోని మహమ్మద్ ముజాహిద్ కు ఓ అపరిచితుడు 12 అంకెల నెంబర్తో ఫోన్ చేసి నేను బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాను మీ లోన్ అప్రూవ్ అయినది చెప్పి బురిడీ కొట్టించి.
నేను వీడియో కాల్ చేస్తాను లిఫ్ట్ చేస్తే మీ వివరాలు మాకు షేర్ అవుతాయి అని చెప్పాడు. దీంతో బాధితుడు వీడియో కాల్ లిఫ్ట్ చేయగా అకౌంట్ నుంచి రూ.1.40 లక్షలు మాయమయ్యాయి. దీంతో బాధితుడు పోలీస్ లను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యాసిర్ అరాఫత్ తెలిపారు.
