భీమ్ గల్ పట్టణ శివారు లోని సంతోష్ నగర్ తండా శివారులో ఆటో పల్టీలు కొట్టిన ఘటన లో ఓ బాలుడు మృతి చెందాడు.
శివారు లోని సంతోష్ నగర్ రోడ్డుపై ఆటో పల్టీలు కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ప్యాసింజర్లు ఆటోతో పాటు రోడ్డు పై పడిపోయారు.
ఆటోలో ప్రయాణిస్తున్న సయ్యద్ రియాన్ (9)కు తలకు బలమైన గాయాలు కావడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి.
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
