HomeTelanganaNizamabadనిమజ్జనానికి వెళ్ళగానే... నిండా దోచేశారు- కమ్మర్ పల్లి లో చోరీ -

నిమజ్జనానికి వెళ్ళగానే… నిండా దోచేశారు- కమ్మర్ పల్లి లో చోరీ –

కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

: తమ పిల్లలతో కలిసి దంపతులు వినాయకుడి నిమజ్జన ఉత్సవానికి వెళ్లారు.ఇది గమనించిన దొంగలు రాత్రి పది గంటలకే ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డ ఘటన నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి లో చోటుచేసుకుంది.

నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లికి చెందిన ఉట్నూరు శ్రీకాంత్ ఇంట్లో నిన్న రాత్రి దొంగ లు తాళం వేసిన ఇంటిని గొల్లం పగలగొట్టి చోరికి పాల్పడ్డారు.

ఇంట్లోకి చొరబడి బీరువాను పగలగొట్టి రెండు తులాల బంగారు ఆభరణాలతోపాటు 30 వేల రూపాయల నగదును దోచుకెళ్లారు. శ్రీకాంత్ రోహిణి దంపతులు ఇంటికి వచ్చి చూసరికి తాళం పగలగొట్టి ఉండడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించారు.

వెంటనే బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments