మూర్ఛ వ్యాధితో వ్యక్తి మృతి చెందిన ఘటన బాసర రైల్వే స్టేషన్ లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
నిర్మల్,కుబీర్ మండలానికి చెందిన రావుసాబ్(38).లేబర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.పండరిపురం వెళ్లడానికి కుటుంబ సమేతంగా బాసర రైల్వే స్టేషన్ కి వెళ్ళారు.
ఈ క్రమంలో హటాత్తుగా మూర్ఛ వ్యాధి రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.భార్య సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి రెడ్డి పేర్కొన్నారు.
