బిఆర్ యస్ పార్టీకి చెందిన మైనార్టీ నేతలు సోమవారం యంఐయం పార్టీలో చేరారు.ఈ మేరకు హైదారాబాద్ లో ని పార్టీ కేంద్ర కార్యాలయం దారుస్సలాం లో అధినేత హాసద్ సమక్షంలో చేరికలు జరిగాయి.
యం ఐ యం లో చేరిన బిఆర్ యస్ నేతల్లో మాజీ డిప్యూటీ మేయర్ మీర్ మజాజ్ అలీ మాజీ వక్ఫ్ బోర్డు ఛైర్మెన్ ఫయాజ్ మరో నేత అమర్ లున్నారు. నిజామాబాద్ నగరంలో పార్టీ ని బలోపేతం చేయడానికి నడుం కట్టాలని హాసద్ వారిని ఆదేశించారు.
వీరితో పాటు యంఐయం నేతలు కార్పొరేటర్ల తో సమావేశం అయ్యారు. నిజామాబాద్ నగరంలో పార్టీ పరిస్థితులను అడిగి తెల్సుకున్నారు.
