పేకాట స్థావరం పై దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఐదవ టౌన్ ఎస్ఐ గంగాధర్ పేర్కొన్నారు.వివరాల్లోకి వెళ్లితే..
ఐదవ టౌన్ పరిధిలోని సాయి నగర్ ప్రాంతంలో నలుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేసి వారిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
వారి నుంచి రూ. 11,390 నగదు స్వాధీన పరచుకున్నట్లు తెలిపారు. నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గంగాధర్ తెలిపారు.
