HomeTelanganaNizamabadఅజ్ఞాతం వీడని కవిత ...పది మాసాలుగా జిల్లా వైపు కన్నెత్తని ఎమ్మెల్సీ .......కీలక నేతలు దొరకని...

అజ్ఞాతం వీడని కవిత …పది మాసాలుగా జిల్లా వైపు కన్నెత్తని ఎమ్మెల్సీ …….కీలక నేతలు దొరకని అపాయింట్మేట్ ..

నేను ముందే మొండి ని జైలు కు పంపి ఇంకా జగమొండి ని చేశారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్తాను నన్ను ఇబ్బందులు పెట్టినోళ్లకు వడ్డి తో సహా చెల్లిస్తాను అంటూ తీహార్ జైలు ప్రాంగణం నుంచి గర్జించిన ఎమ్మెల్సీ కవిత ఇంకా అజ్ఞాతం వీడడం లేదు.

నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ గా ఉన్న ఆమె దాదాపు పది మాసాలుగా జిల్లా వైపు కన్నెత్తి చూడలేక పోతున్నారు. కీలక నేతలకు సైతం ఆమె అందుబాటులోకి రావడం లేదు.

కెసిఆర్ కేటీఆర్ లతర్వాత ఆమెనే కీలకంగా ఉన్న ఆమె మౌన వ్యూహంలోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సుమారు నాలుగు మాసాలు తీహార్ జైలు లో ఉన్న ఆమెకు సుప్రీం కోర్టు లో ఆగస్టు చివరి వారంలో బెయిల్ మంజూరు అయ్యింది.

సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీం కోర్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీకవిత కు బెయిల్ మంజూరు చేసే విషయంలో ఎలాంటి కఠిన షరతులు విధించలేదు.

అయినప్పటికి ఆమె బెయిల్ వచ్చి దాదాపు నాలుగువారాలు కావస్తున్నా ఆమె ఇంకా అజ్ఞాతం వీడడం లేదు. నిజానికి జైలు నుంచి విడుదల అయ్యాక మొదటి హైదారాబాద్ వచ్చిన కవిత కు గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

వందలాది మంది గులాబీ శ్రేణులు ఆమె ఇంటివద్ద బారులు తీరారు. సహజంగా ఒత్తిడి లో ఉన్న ఆమె పది రోజల తర్వాత కలుద్దామని భరోసా ఇచ్చారు.

ఆ మరుసటి రోజే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు. అప్పటి నుంచి బిఆర్ యస్ నేతలెవ్వరికి ఆమె అందుబాటులోకి రావడం లేదు. ఆమె కోటరీ లో ఉండే వారికి సైతం ఆమె కార్యకలాపాలసమాచారం లేదు.

నిజానికి సుదీర్ఘ కాలం జైలు లో ఉన్నప్పుడే పలుమార్లు అస్వస్థతకు గురయ్యారు ,. కవిత దాదాపు 153 రోజులు జైలులో ఉన్నారు. ఈమె మార్చి 15న అరెస్ట్ అయ్యారు.

బెయిల్ నుంచి బయటికి వచ్చాక ఆమె ప్రజాక్షేత్రంలో కి వచ్చి మరింత క్రియాశీలకం అవుతారని గులాబీ నేతలు అంచనా వేశారు. నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ గా ఉన్న ఆమె జిల్లాలో ప్రజా సమస్యల మీద ప్రభుత్వం సమర బేరి మోగిస్తారని భావించారు.

మరో వైపు కేటీఆర్ హరీష్ రావు లాంటి నేతలు రేవంత్ సర్కార్ మీద రోజు ఎదో అంశంలో నిప్పులు చెరుగుతున్నారు. కీలక వ్యవహారాల్లో ప్రభుత్వం ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కవిత తోడవుతారనే ఆశాభావంతో బిఆర్ యస్ క్యాడర్ ఉంది.

కానీ ఆమె బయటికి రావడంలేదు కనీసం జిల్లాకు సైతం ఎంట్రీ ఇవ్వడం లేదు. నిజానికి ఎంపీ గా పనిచేసిన కాలం లోనూ అడపా దడపా జిల్లాకు వచ్చే వారు కానీ పార్టీలో ఆమె కు బలమైన వర్గం ఉంది.

పార్టీ అధికారం కోల్పోయాక మాజీ ఎమ్మెల్యే లు సైతం నియోజకవర్గాలకు మొఖం చాటేశారు. ఓకే ఒక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కూడా బాల్కొండ కు చుట్టపు చూపగా మారారు హైదారాబాద్ కే పరిమితం అయ్యారు.

ఈ నేపథ్యంలోనే కవిత జైలు నుంచి వచ్చాక జిల్లా పార్టీలో యాక్టివ్ అవుతారనే ధీమా క్యాడర్ లో ఉండే

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments