మద్యం సేవించి రోడ్డు పై న్యూసెన్స్ చేసిన ఇద్దరు వ్యక్తులకు రెండు రోజులు జైలు శిక్ష విధించినట్లు మూడవ టౌన్ ఎస్ఐ మహేష్ కుమార్ తెలిపారు. వివరాల్లోకి వెళ్లితే..
మూడవ టౌన్ పరిధిలోని కంటేశ్వర్ గుడి దగ్గర దుబ్బకు చెందిన రాచకొండ శ్రీకాంత్,డెక్క రవి కుమార్ లు మద్యం సేవించి రోడ్డు పై వెళ్తున్న వారిపై న్యూసెన్స్ చేయడంతో పోలీసులు పట్టుకొని సిటీ పోలీస్ ఆక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కోర్టులో హాజరు పరిచారు.
జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ l వారి ఇద్దరికీ రెండు రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
