నగరంలోని మిర్చి కాంపౌండ్ లో దారుణం చోటు చేసుకుంది .రెండున్నర ఏళ్ళ కొడుకు ను తండ్రి హత్య చేసిన ఉదంతం వెలుగు చూసింది.మహా రాష్ట్ర నుంచి బతుకు దెరువుకోసం వచ్చి మిర్చి కాంపాండ్ లో ఉంటున్న ప్రియాంక యువరాజ్ దంపతులకు రెండున్నర నెలల బాబు ప్రేమ్ కుమార్ ఉన్నాడు.
కానీ రోజువారి కూలి చేసే యువరాజ్ ఈ బాబు తనకు పుట్టలేదని అనుమానంతో అతడు నిత్యం భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి నగరంలోని రైల్వే ట్రాక్ పక్కకు బాబును తీసుకొచ్చి కత్తితో నరికి హత్య చేశాడు. రైల్వే ట్రాక్ పక్కన బాలుడి మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు.
స్పందించిన ఎస్హెచ్వో రఘుపతి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అయితే గత రెండు రోజుల క్రితమే ఇంట్లో నుంచి తీసుకెళ్లాడని తల్లి చెప్తుంది
