హైదరాబాద్ ఆహార కల్తీ నియంత్రణ (హెచ్-ఫాస్ట్ ) అధికారులు చార్మినార్‌లో శుక్రవారం మెరుపు దాడులు చేశారు ఓ ఫాస్ట్ ఫుడ్ గోడౌన్‌లో భారీగా కల్తీ ఆహార పదార్థాలు, పాత వంట నూనెను స్వాధీనం చేసుకున్నారు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది.
న్యూ లాడ్‌బజార్, పంచ్ మొహల్లాలో ఉన్న అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్‌లో హెచ్-ఫాస్ట్ బృందం, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఆహార పదార్థాలను తయారు చేసి నిల్వ ఉంచుతున్నట్లు గుర్తించారు.
ఆహార భద్రతా ప్రమాణాలను పూర్తిగా విస్మరించి వ్యాపారం నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.తనిఖీల్లో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ లేకుండానే కార్యకలాపాలు సాగిస్తున్నట్లు, నిషేధిత కృత్రిమ రంగులు వినియోగిస్తున్నట్లు, పలు మార్లు ఉపయోగించిన పాత వంట నూనెను మళ్లీ వినియోగిస్తున్నట్లు బయటపడింది నిర్వాహుకుల మీద కేసులు నమోదు చేసారు
