ఆర్ డివో ఆదేశాల మేరకు ఓ భూమి స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన రెవెన్యూ అధికారిఫై మహిళా విరుచుక పడింది గల్లా పట్టుకొని ఈడ్చుకెళ్లింది . పోలీసులు సకాలం లో రంగంలోకి దిగి మహిళను అదుపులోకి తీసుకున్నారు
ఆదిభట్ల సమీపంలోని తుర్కయంజాల్ పరిధిలోని సర్వే నంబర్ 338లో 1810 గజాల భూమిపై కొంత కాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై ఆదిబట్ల పోలీసుల నివేదిక, సీఐ విజ్ఞప్తిని పరిశీలించిన ఆర్డీవో సంబంధిత భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి చెందిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్‌కుమార్, జీపీవో హన్మంతును ఉన్నతాధికారులు అక్కడికి పంపించారు.అయితే అధికారులు వివాదాస్పద భూమి వద్దకు చేరుకున్న సమయంలో అక్కడే ఉన్న ఓ మహిళ వారిని అడ్డుకుంది.
మీరు నిజంగా అధికారులు అన్న నిర్ధారణ ఏమిటని ప్రశ్నిస్తూ వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. అధికారులు తమ గుర్తింపు కార్డులు చూపించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోగా, ఆర్ఐ ప్రేమ్‌కుమార్ గల్లా పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే ఐడీ కార్డును లాక్కొని దుర్భాషలాడినట్లు అధికారులు ఫిర్యాదులో తెలిపారు.
