తూప్రాన్ 44 జాతీయ రహదారి లో ఉన్న దాబాల్లో మద్యం సిట్టింగ్ కొనసాగిస్తున్న వైనం పోలీసు దాడుల్లో వెలుగు చూసింది కొన్ని దాబాల్లో అక్రమంగా మద్యం సేవించేందుకు అనుమతిస్తున్నట్లు గుర్తించడంతో సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుని మొత్తం 6 దాబాల నిర్వహాకుల పై పోలీసులు కేసు నమోదు చేశారు.
జాతీయ రహదారి 44 పై ఉన్న తెలుగు అరోమా ధాబా నిర్వహకుడు గొల్ల మాధవ్, వినోద్ ధాబా నిర్వహకుడు వినోద్ అజ్మీరా, న్యూ రెడ్డి దాబా నిర్వహకుడు అంజి రెడ్డి, శివ రెడ్డి ఫ్యామిలీ ధాబా నిర్వహకుడు రామ్ రెడ్డి, మనీషా ధాబా నిర్వహకుడు గొల్ల బాలేష్, రెడ్డి ఫ్యామిలీ దాబా నిర్వహకుడు సతీష్ రెడ్డిలపై కేసులు నమోదు చేశారు.
హోటళ్లు, దాబాలు మరియు ఇతర వాణిజ్య సంస్థల్లో అక్రమంగా మద్యం సేవించేందుకు అనుమతించినట్లయితే సంబంధిత నిర్వహాకులు బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని సీఐ వెంకట రాజా గౌడ్ హెచ్చరించారు
