ఆదివారం జరిగే నీట్ ఎగ్జామ్ ఒత్తిడి తట్టుకోలేక మరో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఏపీ లోని వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన జాఫర్ హుసేన్ కుటుంబం హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్పన అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు.
నీట్ . లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంది. అయితే, పరీక్ష ఒత్తిడి తట్టుకోలేక శనివారం (జూన్ 20) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కి చున్నీతో ఉరి వేసుకుని సనా ఆత్మహత్యకు పాల్పడింది.
తన ఆత్మహత్యకు ఎవరు కారణం కాదని.. కుటుంబ అంచనాలు అందుకోలేక చనిపోతున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులకు పిర్యాదు చేశారు
