నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో జాతిపిత మహాత్మాగాంధీ జి 155 వ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఆమె మాట్లాడుతూ.. మహాత్ముడు నమ్మిన సత్యం, అహింస మార్గంలో మనందరం నడుచుకోవాలని మరియు ప్రతి ఒక్కరు తమ జీవిత విలువలకు తమను తాము పునఃసమీక్షించుకోవడానికి మహాత్ముడి జయంతి ఓ సందర్భంగా ఆమె అభివర్ణించారు.
మహాత్ముడి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలన్నారు.ఈ కార్యక్రమంలో వైద్యులు మరియు ఆస్పత్రి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
