వరస దాడులతో కీలక అధికారులకు చెమటలు పట్టించిన ఏసీబీ ఓ డిస్పీ విషయంలో వ్యవహరించిన తీరు ఫై విమర్శలు వెల్లువెత్తాయి వందల కోట్ల ఆస్తల చిట్టా చేతికి చిక్కినా సరే ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఒత్తిళ్ల తో వెనక్కి తగ్గిన ఏసీబీ అప్రతిష్ట ను ముఠా గట్టు కుంది.
కానీ ఎట్టకేలకు డిస్పీ ని అరెస్టు చేసి కొంతలో కొంత డ్యామేజీ కంట్రోల్ చేసుకుంది ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగం డీఎస్పీ సంకిరెడ్డి భీమ్ రెడ్డిని ఏసీబీ సోమవారం అధికారికంగా అరెస్టు చేశారు.
భీమ్ రెడ్డి, అక్రమ మార్గాల్లో వందల కోట్ల విలువైన ఆస్తులను కూడగట్టుకున్నట్లు సోదాల్లో వెల్లడైంది.నాలుగు రోజుల క్రితం సోదాలు చేపట్టిన సమయంలో, అక్రమాస్తుల చిట్టా చూసి భీమ్ రెడ్డి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ఆయన బీపీ 170/120కి పెరగడంతో, అధికారులు తొలుత ఆయన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్యుల నివేదికలు, ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, పరిస్థితి కుదుటపడటంతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు, తదుపరి విచారణ కోసం ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు.
గురువారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌లోని నార్సింగి, ఇబ్రహీంబాగ్, గచ్చిబౌలి, టెలికాం నగర్, మణికొండలతో పాటు తెలంగాణ, కర్ణాటకలోని బంధువులు, మిత్రులు, బినామీలకు చెందిన మొత్తం 16 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి.
ఈ తనిఖీల్లో అక్రమాస్తుల లెక్కలు చూసి అధికారులు సైతం విస్తుపోయారు.కర్ణాటకలోని దేవనహళ్లితో పాటు ఇతర ప్రాంతాల్లో సుమారు 45 ఎకరాల వ్యవసాయ భూములు, లగ్జరీ విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్లలో వాటాలు, ఐటీ కారిడార్లో ఖరీదైన ఫ్లాట్లు. రూ. 43.6 లక్షల నగదు, 2 కేజీల బంగారం, 20 కేజీల వెండి స్వాధీనం.
సోదాల సమయంలో లభించిన 23 విదేశీ మద్యం సీసాలపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా కేసు నమోదు చేసింది. ఏళ్లుగా పోలీస్ శాఖలో కీలక విధుల్లో ఉంటూ, అడ్డదారిలో సంపదను పోగేసుకున్న భీమ్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఉదంతంపై ఏసీబీ మరింత లోతుగా విచారణ జరుపుతోంది.
