Saturday, April 18, 2026
HomeTelanganaNizamabadఅసెంబ్లీ సాక్షిగా మాట తప్పిన రేవంత్....

అసెంబ్లీ సాక్షిగా మాట తప్పిన రేవంత్….

ఏమార్పీస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ…నిండు అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను మోసం చేసిందని ఏమార్పీస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ద్వజమెత్తారు.

బుదవారం నగరంలోని ఏర్పాటు చేసిన ఏమార్పీస్,ఎంఎస్పి అనుబంధ సంఘాల రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సుప్రీం కోర్టు ఆగస్టు 1 ఎస్సీ వర్గీకరణ కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతిస్తున్నామని చెప్పి మాదిగలను మోసం చేసిందని విమర్శించాడు.సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలంటూ అధికారులను సీఎం ఆదేశించారు.

కానీ కేవలం ఎన్నికను దృష్టిలో ఉంచుకుని వర్గీకరణ స్వాగతిస్తున్నామని చెప్పి మాదిగలను మోసం చేస్తున్నారు. గడించిన 10 నెలలో వర్గీకరణకు ముందు వచ్చిన ఉద్యోగాల నియామకానికి కూడా వర్గీకరణ తీసుకొస్తామని చెప్పి మొన్న 11 వెలకు పైగా డీఎస్సీ నోటిఫికేషన్ లో ఎస్సీ వర్గీకరణ చేయకుండానే నియామకం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు.

అలాగే ఎన్నికలో పేర్కొన్న విధంగా రు 2000 నుంచి 4000 పెన్షన్ చేస్తానని చెప్పి ప్రజను మోసం చేశారు. మొన్న ఏర్పడ్డ పక్క రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పిన విధంగా పెన్షన్ ఇస్తున్నారని పేర్కొన్నారు.మాలాలకు తలవంచి మాదిగలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు.

మాదిగలను మోసం చేసిన ఏ ప్రభుత్వం అధికారంలోకి ఉండదని విమర్శించాడు.అలాగే అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ చేస్తానని చేపిన రేవంత్ సర్కార్ వర్గీకరణ చేయకుంటే నిద్ర లేకుండా చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఏమార్పీస్,ఎంఎస్పి అనుబంధ సంఘాల రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!