HomeTelanganaNizamabadరాష్ట్రాన్ని బిఆర్ఎస్ పార్టీ భ్రష్టుపట్టించింది..పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్...

రాష్ట్రాన్ని బిఆర్ఎస్ పార్టీ భ్రష్టుపట్టించింది..పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్…

పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందని పిసిసి అధ్యక్షుడు,ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించాడు.

సోమవారం నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్పొరేషన్ చైర్మన్ గా కేశ వేణు బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అవాస్తలు, ఆరోపణలను కాంగ్రెస్ కార్యకర్తలు తిప్పికొట్టాలని సూచించారు. కేవలం 9 మాసాల్లోనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు.

కేసీఆర్ పదేళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. నీళ్లు నిధులు నియామకాలు అనే అంశంపై తెలంగాణ రాష్ట్రాన్ని సాదించుకుంటే కేసీఆర్ ప్రభుత్యం భూములు కబ్జా, నీళ్ళ పరంగా రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు.

అలాగే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి చిప్ప చేతుకు ఇచ్చారనీ దుయ్యబట్టారు.అలాగే కేటీఆర్, హరీష్ రావు లు నిరుద్యోగ యువత ను రెచ్చగొడుతున్నారని తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగాలలో విద్యార్థులకు ఎక్కడ కూడా అన్యాయం జరగదని నేను కూడా బీసీ బిడ్డనే అని హామీ ఇచ్చారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులను తప్పు తోవ పట్టిస్తున్నారనీ,ప్రజలను ఆసరా తీసుకొని ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్యం అమలు చేస్తుందని,పారిశ్రామికంగా కూడా అభివృది చేయాలని ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ను కోరారు.ఇంటిగ్రేటెడ్ కళాశాల మంజూరు..

రాష్ట్రంలో 28 ఇంటిగ్రేటెడ్ కళాశాలను మంజూరు చేశామని,అందులో నిజామాబాద్ జిల్లా కు కూడా ఇంటిగ్రేటెడ్ కళాశాలను మంజూరు చేశామని తెలిపారు. మరో మెడికల్ కళాశాల తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యం,క్రీడల దిశగా అడుగులు ముందుకు వేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రూపంలో ఫలితం ఉంటుందని తెలిపారు.

ఇది కార్యకర్తల పార్టీ అని తెలిపారు.అలాగే దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం,కాంగ్రెస్ త్యాగాల పార్టీ అని తెలిపారు.వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రతి కార్యకర్త శ్రమించినా అందరికీ పదవులు పొందవచ్చని పేర్కొన్నారు.

క్రీడలకు కేరాఫ్ నిజామాబాద్..తెలంగాణ లోనే క్రీడలకు కేరాఫ్ అడ్రస్‌గా నిజామాబాద్ ను తీర్చిదిద్దుతాం అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ రాష్ట్రానికి ఎందరినో క్రీడాకారులను అందించిన ఘనత జిల్లాకు ప్రాధాన్యత ఉందని ఆయన చెప్పారు.

క్రీడల్లో ఆదర్శంగా నిలబడాల్సిన నిజామాబాద్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆ స్థాయికి చేరుకోలేకపోయిందని, క్రీడలను ప్రోత్సహించేందుకు మా ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తోందన్నారు. యువతను క్రీడల వైపు మళ్లించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments