వడ్ల కొనుగోళ్ళలలో నెలకొన్న ప్రతిష్ఠబన కు ప్రభుత్వం తెరదించింది. శనివారం నుంచి వడ్ల కొనుగోళ్ల పక్రియ మొదలు కాబోతుంది.
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కు సంబంధించి వరిపంట కోతలు మొదలై 3 వారాలు అవుతున్నా వడ్ల కొనుగోళ్లు మొదలు కాక పోవడంతో రైతులు వడ్ల ను రోడ్లమీదికి తెచ్చి పడిగాపులు కాస్తున్నారు.
ప్రభుత్వం ఎప్పటిలాగే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది కానీ ఈసారి మిల్లర్లకు ధాన్యం కేటాయించే విషయంలో అనేక బ్యాంకు గ్యారెంటీ లను అనివార్యం చేసింది కేటాయించే వడ్ల లకు కనీసం 25 శాతం విలువగల గ్యారెంటీ తప్పనిసరి చేసింది.దీనితో మిల్లర్లు ధాన్యం తీసుకోవడానికి ససేమిరా అన్నారు.
దీనితో కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వచ్చినప్పటికి మిల్లర్లు వడ్లు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం కూడా రైతుల నుంచి వడ్లు తీసుకోవడానికి వెనుకాడింది.
అయితే రైతుల్లో ఆందోళన వ్యక్తం కావడంతో సీఎంవో ఆదేశాల మేరకు సివిల్ సప్లై కమిషనర్ శనివారం యూనియన్ నేతలతో తన కార్యాలయంలో చర్చలు జరిపారు. వడ్ల కేటాయింపు లో బ్యాంకుగ్యారెంటీ అనివార్యం ఆయన స్పష్టం చేశారు కానీ 25 శాతం కాకుండా 10 శాతం కు ఓకే చెప్పారు.
మరో వైవు కమిషన్ సైతం పెంచాలనే డిమాండ్ ను సీఎం కు దృష్టి కి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కమిషనర్ చేసిన సూచన మేరకు వడ్లు కొనుగోలు చేయడానికి అంగీకరించారు.
