ద్విచక్ర వాహనం పై నుంచి కింద పడి ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలైన ఘటన నగరంలో శుక్రవారం చోటు చేసుకుంది.స్థానికుల సమాచారం మేరకు..
నగరానికి చెందిన యూసుఫ్ అతని స్నేహితుడు అవినాష్ లు ఇద్దరు ద్విచక్ర వాహనంపై గిరిరాజ్ కళాశాల నుంచి నిజామాబాద్ వైపుగా వస్తున్న సమయంలో గిరిరాజ్ కళాశాల వద్ద అదుపు తప్పి కింద పడ్డారు.దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు గమనించి హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.యూసుఫ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
