HomeLaw and Orderసౌత్ వెస్ట్ జోన్ లో అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్ .......డైరెక్ట్ ఐపీయస్ లేనేట్లేనా...

సౌత్ వెస్ట్ జోన్ లో అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్ …….డైరెక్ట్ ఐపీయస్ లేనేట్లేనా ?

హైదారాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు ముడిపడిన లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రభుత్వం ప్రాధాన్యత అంశంగా వుంటుంది. అందుకే కీలక పోలీసు అధికారుల పోస్టింగ్ ల విషయంలో ఉన్నతాధికారులు ఎడతెగని కసరత్తులు చేస్తారు.

సైబారాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధి లో పోలీసు బాస్ ల విషయంలో ఎలా ఉన్న హైదారాబాద్ కొత్వాల్ పోస్టింగ్ విషయంలో సీఎం స్వయంగాఎంపిక చేస్తారూ అడిషినల్ డిజి స్థాయి లో సమర్ధుడైన అధికారికి పోస్టింగ్ ఇస్తారు.

అలాగే హైదారాబాద్ కమిషనరేట్ పరిధి లోని ఏడు జోన్ లకు సైతం డీసీపీ లను సమర్థులైన వారికి పోస్టింగ్ లు ఇస్తారు. నగరంలో శాంతి భద్రతలు నిర్వహణ నిక్కచ్చిగా ఉండే వారికి తీవ్రమైన నేరాలమీద ఉక్కుపాదం మోపేవారిని ఏరికోరి ఎంపిక చేస్తారు. వీలైనంత మేరకు డైరెక్ట్ ఐపిఎస్ లకే డీసీపీ లుగా పోస్టింగ్ ఇస్తారు.

అందులోనూ ఎస్పీ గా పదోన్నతి పొందిన వారికి మొదటి పోస్టింగ్ గా డీసీపీ లుగా నియమిస్తారు. దీనితో వారు అక్కడి బాధ్యతలను ఛాలెంజ్ గా తీసుకుంటారు.

ముఖ్యంగా శాంతి భద్రతల నిర్వహణలో పక్కాగా ఉంటారనే భావన ఉంది. హైదారాబాద్ మహానగరంలో అన్ని జోన్ లలో కన్నా సౌత్ వెస్ట్ జోన్ అత్యంత కీలకంగా భావిస్తారు.

గోల్కొండ, గోషామహల్ అసిఫ్ నగర్ ,కుల్ సుమపుర లాంటి పురా మతపరంగా అత్యంత సున్నిత మైన ప్రాంతాలు ఇదే జోన్ లో ఎక్కువగా ఉన్నాయి దీనితో మట్కా ,గంజాయి. దొంగతనాలు లతో పాటు అసాంఘిక కార్యకలాపాలు చేసే వారికి ఇదో అడ్డాగా వుంటుంది.

సహజంగానే ఇక్కడ పనిచేయడం కత్తిమీద సామే. అందుకే డిఎస్పీ స్థాయి లో పనిచేసిన వారిని కాకుండా డైరెక్ట్ ఐపిఎస్ లను డీసీపీ లుగా నియమిస్తారు. అందులోనూ సౌత్ వెస్ట్ జోన్ విషయంలో ఆచితూచి అడుగేస్తారు.

గతంలో ఉదయ్ కుమార్ డీసీపీ గా వుండగా ఆయన స్థానంలో డిఎస్పీ నుంచి ప్రమోట్ అయిన చంద్ర మోహన్ ను డీసీపీ గా నియమించారు. ఆయన ఏసీపీ ల మీద పూర్తీ స్థాయిలో నియంత్రించ లేక పోతున్నారనే విమర్శలున్నాయి.

ఇటీవలే యం ఐఎం ఎమ్మెల్యే మజీద్ కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ల మధ్య వివాదం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.ఈ వ్యవహారంలో పోలీసులవైఫల్యం కొట్టచ్చినట్లుగా ఉంది. అలాగే అనేక నేరాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి.

డైరెక్ట్ ఐపీఎస్ ను డీసీపీ గా నియమించాలనే వాదన తెరమీదికి వచ్చింది. ఎలాగో ప్రభుత్వం రాష్త్రం లో భారీఎత్తున ఎస్పీ లు డీసీపీ ల బదిలీలు చేయాలనీ కసరత్తులు చేస్తుంది. ఈసారైన ఈ జోన్ కు డీసీపీ మరింత కఠినంగా వ్యవహరించే ఐపియస్ అధికారి కి నియమించాలనే డిమాండ్ ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments