రెండు లక్షల విలువ గల 20 మొబైల్ ఫోన్లు రికవరీ.. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఒకటవ టౌన్ పరిధిలో పలు ప్రాంతాల్లో సుమారు రెండు లక్షల విలువైన 20 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రఘుపతి తెలిపారు.
వివిధ ప్రాంతాలలో మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు శనివారం 20 మొబైల్ ను CEIR పోర్టల్ సహాయంతో ట్రేస్ చేసి సంబంధిత బాధితులకు అప్పగించడం జరిగిందనీ తెలిపారు. వీటి విలువ సుమారు రెండు లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా టౌన్ వన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ బస్టాండ్ మార్కెట్ తదితర రద్దీ ప్రాంతాలలోని మొబైల్ దొంగతనాల నుండి జాగ్రత్త వహించాలని సూచించడం జరిగింది.
ఎవరైనా తమ మొబైల్ ఫోన్లు దొంగతనానికి గురైనప్పుడు వెంటనే మొబైల్ ఐఎంఈఐ నంబర్ ఆధారంగా సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే, ఆ నంబర్ ఆధారంగా సీఈఐఆర్ పోర్టల్ ద్వారా చోరీకి గురైన మొబైల్ ఫోన్స్ రికవరీ చేస్తామని తెలిపారు.
