ఇసుక ట్రాక్టర్ ఢీ కొనడంతో సైకిలిస్టు మృతి చెందిన ఘటన భిక్కనూరు మండల కేంద్రంలో గురువారం జరిగింది . బిక్కనూర్ కు చెందిన నీల ఇస్తారి (55) సైకిల్ పైగాంధీ చౌక్ వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఢీ కొనడంతో ఇస్తారి అక్కడికక్కడే మృతి చెందాడు . ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని, ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ను ఆగ్రహంతో చితకబాదారు
