విద్యాశాఖలోనియామకాల పేరుతొ నిరుద్యోగులనుంచి టోకరా ఇచ్చిన ముఠా బాల్కొండ కేంద్రంగానే ఈ వసూళ్ల దందా సాగించినట్లుగా సమాచారం. ఇందులో అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత అండ ఉండడం వల్లే యంత్రాంగం ఆ వైపు కన్నెత్తి చూడలేక పోతుంది. వసూళ్ల పాల్పడ్డ వారిమీద చర్యలు తీసుకోవాలని బాధితులు లబోదిబో మంటున్నా సరే ఎవ్వరు పట్టించుకోవడం లేదు.స్వచ్ఛంధ సంస్థల ముసుగులో నిరుద్యోగ యువకుల కు ఉద్యోగాల ఏర వేసి భారీ గా దండు కున్నారు. నిరుద్యోగుల నుంచి కోట్లాది రూపాయలువసూలు చేసింది.
మొఖం చాటేసింది. అయితే నిరుద్యోగులతో మూడు నెలల పాటు చాకిరి చేయించుకున్న అధికారులు ఇప్పడు తమకేమి సంబంధమా లేదంటూ చేతులు ఎత్తేస్తున్నారు. లక్షలు పోసి దక్కించుకున్న కొలువులు ఉత్తవే నని తేలడంతో నిరుద్యోగులుగుండెలు బాదుకుంటున్నారు .
తమ శాఖ లో ఉద్యోగాల పేరుతొ కోట్లు దండుకున్న వైనం ఫై విద్యాశాఖ అధికారులు కనీసం పిర్యాదు చేయక పోవడం ఫై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పిర్యాదు చేస్తేనే
ఈ దందా లో ఎవరెవరి ప్రమేయం ఉందనేదిబయటికి పొక్కే అవకాశం ఉంది . కానీ ఆ దిశ గా ఎవ్వరు చర్యలకు సిద్ధం కావడం లేదు
విద్యాశాఖ లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేయడానికి అర్హత ఉన్న యువకులు కావాలని గ్లోబల్ ఫౌండేషన్ తో పాటు గీతాంజలి ఫౌండేషన్ ల పేరుతొ సోషియల్ మీడియా వేదికల్లో ఓ ప్రకటన వచ్చింది.
జిల్లాలోని ఆయా ప్రభుత్వ పాఠశాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు సహాయకులుగా అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ గా పనిచేయాలని అదికూడా వాలంటరీ లాగేనే చేయాల్సి వుంటుందని షరతు పెట్టారు నెలకు రూ 15 నుంచి 18 వేలు ఇస్తామని కాలక్రమేని ప్రభుత్వం రెగ్యులర్ చేసే అవకాశం వుందని ఆశ పెట్టారు. ఇంకేముంది వ్యవహారం బయటికి పొక్కకుండా దాదాపు నిజామాబాద్ జిల్లాలో 38 మంది ను పోగు చేసారు. ఒక్కరి నుంచిలక్ష నుంచి రెండు లక్షల రూపాయలు వసూలు చేసారు మరో వైపు తమది జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన ఫౌండేషన్ అంటూ నిర్వాహకులు జిల్లా విద్యాశాఖ అధికారులను సైతం కలిశారు తాము జిల్లాలో ప్రభుత్వ పాఠశాల్లో వాలెంటర్ లను నియమిస్తామని వారికి తామే జీతాలు ఇస్తామని వారి సేవలను వినియోగించుకొవాలని కోరారు. కంప్యూటర్ ఆపరేటర్లుగా,
P T లకు అసిస్టెంట్లుగా,
క్లీనింగ్ సెషన్ లో వర్కర్స్,
ఎలక్ట్రిషన్ లుగా ఆయా పాఠశాలకు నియమించారు. మొదట్లోనే విద్యాశాఖ నుంచి ఎలాంటి జీతాలు ఇవ్వరని స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు స్పష్టం చేసారు. కానీతామే మొదటి ఆరు నెలలు తమ సంస్థే జీతాలు చెల్లిస్తుందని నిర్వాహకులు నమ్మబలికారు కానీ వారంతా ఆయా పాఠశాల్లో చేరి మూడు నెలలు కావస్తున్న నయా పైసా ఇచ్చే నాధుడే లేకుండా పోయారు.తమ గోడు చెప్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు
