లారీ ఓమిని వ్యాన్ ను ఢీ కొనడంతో వ్యాన్ డ్రైవర్ మృతి చెందిన ఘటన నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. నగర శివారులోని మల్లారం గండిలో నిజామాబాద్ నుంచి అటుపైగా వడ్ల లోడ్ తో వెళ్తున్న లారి..మల్లారం నుంచి నిజామాబాద్ వైపుగా బిడిల లోడ్ తో వెళ్తున్న ఒమిని వ్యాన్ ను ఢీ కొనడంతో వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు.
