సహాయం చేస్తానని నమ్మించి ఒంటి మీద ఉన్న నగలు కాజేసి తోటి మహిళాను హత్య చేసిన ఉదంతం సైబరాబాద్ కమిషనరేట్ పరిధి లో గండి మైసమ్మ లో జరిగింది.మృతురాలి ది బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీగా గుర్తించారు.
బాన్స్ వాడ కు చెందిన బుసిబోయిన గంగమణి(40)తోటి కార్మికురాలు అంజమ్మ (44) లు ఈనెల 13న బాన్సువాడ నుంచి ఆర్టీసీ బస్సులో గండి మైసమ్మ చౌరస్తా కు చేరుకున్నారు.
అక్కడ నిర్మాణ ప్రదేశంలో అంజమ్మనుహత్య చేసి ఆమె ఒంటి మీద ఉన్న నగలు కాజేసి గంగమణి పరార్ అయిందిఅయితే దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి పరారీ లో ఉన్న గంగామణి ని అరెస్టు చేశారు
