నిజామాబాద్ వినాయక్ నగర్ లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ శ్రీరామ్ సాగర్ 1989-98 లో చదివిన పూర్వవిద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒకచోట చేరి గత అనుభవాలు నెమరు వేసుకున్నారు.
25 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారంతా ఒకరికొకరు పలకరించుకొని వారి జీవన స్థితిగతులు పంచుకుని రోజంతా ఆనందంగా గడిపారు.ఇన్ని సంవత్సరాల తర్వాత నాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు. అనంతరం ఆనాటి ఉపాధ్యాయులను పూర్వవిద్యార్థులు సన్మానించారు.
