విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన సదాశివనగర్ మండలం ఆడ్లూర్ ఎల్లారెడ్డిలో చోటుచేసుకుంది.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…
ఆడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన సిద్దిరాములు అనే వ్యక్తి చెట్లని నరికేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యాదాఘాతానికి గురైయ్యాడు.
దీంతో స్థానికులు గమనించి కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
