HomeCRIMEఆరు నెలలుగా వేధింపులు ....కాలేజీ కి కూడా మానేసింది .........అయినా దక్కని ప్రాణాలు

ఆరు నెలలుగా వేధింపులు ….కాలేజీ కి కూడా మానేసింది ………అయినా దక్కని ప్రాణాలు

నిందితుడు రాజ్‌కుమార్ సదరు మైనర్ బాలికను ప్రేమ పేరుతో ఆరు నెలలుగా వేధిస్తూనే ఉన్నాడు .. శంషాబాద్‌లో కాలేజీకి వెళ్లే సమయంలోనూ రాజ్‌కుమార్ ఆమె ను అటకాయించేది , అతడి భయానికి తాళలేక తల్లి ఆ బాలికను కాలేజీకి పంపడం మాన్పించేసింది.

ఇటీవల పరీక్షలు ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో తల్లి దగ్గరుండి బాలికను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లింది. అయితే, పరీక్ష ముగిసిన వెంటనే బాలికను అందరూ చూస్తుండగానే లాక్కెళ్లేందుకు రాజ్‌కుమార్ ప్రయత్నించాడు.

‘గతంలో నీ తండ్రిని ఫుల్లుగా తాగించి హార్ట్ ఎటాక్ అని చెప్పి నమ్మించి చంపినట్లే, మిమ్మల్ని కూడా చంపేస్తా’ అంటూ రాజ్‌కుమార్ నానా హంగామా చేసాడు ఎలాగో తప్పించుకొని వచ్చేసారు. చివరికి వేధింపుల తట్టుకోలేక బాధితురాలు తల్లి పోలీసులను ఆశ్రయించింది

////// రెండే గంటలు ఆరు హత్యలు /////////

బెయిల్ మీద బయటికి వచ్చిన రాజ్‌కుమార్ ఉన్మాది అవతారం ఎత్తాడు కేవలం రెండు గంటల వ్యవధిలో సాగించిన నరమేధం పోలీసులకే ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. రాత్రి 11 గంటల సమయంలో సదరు మైనర్ బాలిక ఇంటికి వెళ్లిన రాజ్‌కుమార్, ఆమె అమ్మమ్మ, నాయనమ్మ ఎంత వారించినా వినకుండా బాలికను బలవంతంగా కారులో 3 కిలో మీటర్ల దూరంలో ఉన్న దైవాలగూడ చెరువు కట్ట వద్దకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

ఆపై ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఉన్మాది, తిరిగి బాలిక ఇంటికి వచ్చి తనను అడ్డుకున్నారనే కక్షతో ఆమె అమ్మమ్మ, నాయనమ్మలను కూడా అతి కిరాతకంగా నరికి చంపాడు.

అంతటితో ఆగకుండా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో తన ఇంటికి బయల్దేరి, దారిలో భార్యకు ఫోన్ చేసి పిల్లలను చూస్తానని చెప్పాడు. ఇంట్లోకి వెళ్లడమే ఆలస్యం భార్యపై కత్తితో దాడి చేయగా, ఆమె ప్రాణభయంతో బయటకు పరుగులు తీసినప్పటికీ వదలకుండా ఈడ్చుకుంటూ లోపలికి లాకెళ్లి గొంతు కోసి చంపేశాడు.

ఆ తర్వాత నిద్రిస్తున్న తన ఇద్దరు కన్న పిల్లలను సైతం ఏమాత్రం జాలి లేకుండా గొంతు కోసి మట్టుబెట్టాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments