బంజారాహిల్స్ లో మరో కారు అదుపు తప్పి బీభత్సం సృష్టించింది ఈసారి అత్యంత ఖరీదైన ఫెరారీ కారు అదుపుతప్పి హిల్ వ్యూ అపార్ట్మెంట్ ప్రధాన గేటును బలంగా ఢీకొట్టింది. దీనితో అపార్ట్మెంట్ గేటుతో పాటు కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో వారికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. ప్రమాదం సమయంలో రోడ్డుపై పెద్దగా రద్దీ లేకపోవడంతో మరింత పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.
సమాచారం అందుకున్న ఫిలింనగర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.కేసు నమోదు చేసి పరారీ అయిన వారి కోసం గాలిస్తున్నారు
