రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరు హత్యల కేసు లో నిందితుడు రాజ్‌కుమార్ వేట లో పోలీసులు పురోగతి సాధించారు కొత్తూరు మండలంలోని అక్కివేనిగూడెం సమీపంలో ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లుప్రచారం జరుగుతోంది.
అయితే దీనిపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. రాజ్‌కుమార్ కోసం పోలీసులు ప్రత్యేకంగా 9 బృందాలతో విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు ఉపయోగించిన కారును నిన్న చేగూరు రైల్వే లైన్ సమీపంలో గుర్తించిన విషయం తెలిసిందే.
అలాగే అతని ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతి. ప్రకటించింది ఆదివారం ఉదయం ముఖానికి మాస్క్ ధరించి టిఫిన్ సెంటర్ సమీపం లో వుండగా పట్టుకున్నారని ప్రచారం జరుగుతుంది
