ప్రవేట్ బస్సు లో ఓడిశా నుంచి హైదరాబాద్‌కు 41 కిలోల గంజాయి రవాణా చేసే ముఠా గుట్టు ను ఈగల్ అధికారులు రట్టు చేసారు . డెలివరీకి ముందే అధికారులు మెరుపు దాడి చేశారు.
డ్రైవర్, కండక్టర్,హెల్పర్ కలిసి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. నిందితుల నుంచి రూ.20.5 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ రవాణా చేసిన బాబా భోలానాథ్ ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు.
పట్టుబడ్డ నిందితుల నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ రిసీవర్‌తో పాటు మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు.
