HomeTelanganaNizamabadఇందూరు లో ఘనంగా ఆర్య సమాజ్ మహా సమ్మేళనం

ఇందూరు లో ఘనంగా ఆర్య సమాజ్ మహా సమ్మేళనం

పూర్వ నిజామాబాద్ జిల్లా ఆర్య సమాజాల ఆర్య మహాసమ్మేళనం ఇందూరు ఆర్య సమాజం భవనంలో ఆదివారం రోజున ఉదయంయజ్ఞంతో ప్రారంభమై ఉద్యమస్ఫూర్తివంతమైన కార్యక్రమాలను చేపట్టారు.

పలు తీర్మానాల్ని చేశారు. మూడు నెలల తర్వాత అక్టోబర్ మాసంలో బోధన్ ఆర్య సమాజంలో జిల్లా సమ్మేళనం ఏర్పాటు చేయాలని సర్వసభ్య సమావేశం చేయాలని సంకల్పించింది. రెండవ అంశము ప్రతినెల కామారెడ్డి ఆర్య సమాజంలో చివరి ఆదివారం నాడు కామారెడ్డి క్షేత్ర భాగంలో ఉన్న సమాజాలను చైతన్య పరుస్తూ సత్సంగం నిర్వహించడం.

మూడవ అంశము ప్రతి ఆర్య సమాజంలో బాల వాడి కేంద్రాలను నెలకొల్పి శిక్షణ ఇవ్వాలని, వారికి సంధ్యా విధి యోగ నైతిక శిక్షణ మొదలగు అంశాలలో తర్ఫీదు ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగింది. మరో ముఖ్య అంశము ఆర్య వీర్దల్ శాఖ ఏర్పరిచి యువకులలో మంచి సుశిక్షణ ధార్మిక భావాలతో జాతీయ భావాలను నిర్మాణం చేయాలని తీర్మానించడం జరిగింది.

ప్రతి నిత్యము శాఖ నిర్వహించాలని కోరింది. శ్రావణమాసంలో ఇంటింటా యజ్ఞాలను చేయాలని, పర్యావరణహితం కోసం చెట్లను నాటాలని, ప్రతి పురోహితుడు యజ్ఞంతోపాటు ఒక మొక్కను నాటాలని తీర్మానించడం జరిగింది.

మరో ముఖ్య అంశము శ్రావణి ఉపకర్మతో పాటు ఆర్య సత్యాగ్రహ బలిదాన శ్రద్ధాంజలి ఘటించుట. పాఠశాల సెలవు రోజుల్లో సదాచార బాలల ప్రశిక్షణ శిబిరాల ద్వారా వ్యక్తి నిర్మాణం చేసే అంశాలను తీర్మానం చేయడం జరిగింది.

ఇందులో రాష్ట్ర బాధ్యులు డాక్టర్ ధర్మతేజ, జగన్మోహన్ రెడ్డి, రాజేశ్వర్, ధన్ పాల్ ఆర్య, వివిధ సమాజాల పదాధికారులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ఇట్టి సభకు ఆర్య సమాజ అధ్యక్షులు శ్రీ మాంకాల విజయకుమార్, కార్యదర్శి తిరుమల శ్రీనివాస్ ఆర్య, కోశాధికారి కొత్తపల్లి శ్రీనివాస్, ఇందూరు ఆర్య సమాజ అధికారులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ప్రణవ్ కుమార్, ఆచార్య వేద మిత్ర, యోగ సిద్ధిరాములు, సుదర్శనమణి, సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments