సంగారెడ్డి జిల్లా జోగిపేట్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం లో కోటగిరి మాజీ జడ్పీటీసీ తో పాటు ఆయన కొడుకు మృత్యువాత పడ్డారు మిగితా కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలతో బయట పడ్డారు.
కోటగిరి మండలం బస్వా పూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ జడ్పిటిసి సభ్యుడు శివరాజు దేశాయి తన కొడుకు రాజు తో పాటు కుటుంబ సభ్యులతో బుధవారం హైదారాబాద్ కు కారులో వెళ్తుండగా సంగారెడ్డి జిల్లా జోగిపేట్ వద్ద మరో వాహనం ఢీకొట్టింది
ఈ ప్రమాదంలో ఆయనతో పాటు కొడుకు రాజు దేశాయ్ లు అక్కడిక్కడే మృతి చెందారు. భార్య, కోడలికి కూడా గాయాలయ్యాయి. శివరాజ్ దేశాయ్ మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి వర్గీయుడిగా ఉన్నారు
