ఆదివారం జరిగిన బాపూజీ వచనాలయం ఎన్నికల్లో భక్తవత్సలం(ఢిల్లీ) ఫ్యానల్ విజయం సాదించింది. ఆదివారం ఎన్నికలు జరగగా సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల వరకు కౌంటింగ్ ఉత్కంఠగా కొనసాగింది.
అధ్యక్షుడిగా భక్తవత్సలం(ఢిల్లీ) ఉపాద్యక్షుడిగా అశోక్, దేవీదాస్, ప్రధాన కార్యదర్శిగా సుధాకర్ రావ్, కోశాధికారిగా గంగాధర్, సంయుక్త కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. బాపూజీ వచనలయ ఎన్నికలలు హారహోరి గా సాగాయి
రాజేశ్వర్ ప్యానల్ మరియు భక్తవత్సలం ప్యానల్ పోటీ పడ్డాయి చివరి నిమిషం వరకు నువ్వా నేనా అన్నట్టు సాగింది ఢిల్లీ ప్యానల్ 12 మంది కార్యవర్గ సభ్యులు మరియు అధ్యక్షుల తో పాటు ఉపాధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి,సంయుక్త కార్యదర్శులు, పదువులను ఢిల్లీ ప్యానల్ క్లిన్ స్వీప్ చేసింది గెలిచిన అభ్యర్థులు సంబురాలు చేసుకున్నారు
ఈ సందర్బంగా గెలిచినా అధ్యక్షులు భక్తవత్సలం మాట్లాడుతూ మా పైన నమ్మకం ఉంచి అన్ని పదువులకు మా అభ్యర్థులను గెలిపించిన ప్రతి ఒక్క సభ్యుడికి ధన్యవాదములు తెలిపారు మీకు ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీ ని తూచ తప్పకుండ పూర్తి చేస్తామని బాపూజీ వచనలయానికి కనీవిని ఎరగని రీతిలో అభివృధి చేస్తామన్నారు మాకు అండగా నిలిచినా ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు
