HomeCRIMEఉద్యోగం ఇప్పిస్తానని ఘరానా మోసం ..

ఉద్యోగం ఇప్పిస్తానని ఘరానా మోసం ..

జిల్లా ఆరోగ్య శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి బురిడీ కొట్టించాడు. ఉద్యోగాల పేరిట ఓ వ్యక్తి మోసానికి పాల్పడిన విషయం బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం…

నిజామాబాద్ ముజాహిద్ నగర్ కు చెందిన నజియ సుల్తానా బిఎస్సి నర్సింగ్ కోర్స్ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో 2024 నవంబర్ ఆరవ తేదీన జిల్లా ఆరోగ్యశాఖలో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారికి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది.

అందుకు ఉన్నదిగా సుల్తానా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రూమ్ నంబర్ 201 లో వెళ్లి దరఖాస్తు చేసుకున్నారు. అదే అరుదుగా తీసుకున్న అపరిచిత వ్యక్తి నవంబర్ 30న నజీయసుల్తానాకు ఫోన్ చేసి మీ యొక్క జాబ్ అప్లికేషన్ రిజెక్టు లిస్టులో ఉంది అని తెలుపడంతో సదరు మహిళ ఖంగుతిన్నారు.

దీంతో అపరిచిత వ్యక్తి నేను మీకు ఉద్యోగం వచ్చే విధంగా చేస్తాను అందుకు కొంత మొత్తం ఖర్చు పెట్టాల్సి వస్తుందని మహిళతో బేరం మొదలుపెట్టారు. చివరకు రూ. 1.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు.

వ్యక్తి చెప్పిన మాటలు నమ్మి నవంబర్ 30న తన గూగుల్ పే నుంచి రూ 20000 పంపించినట్లు వాపోయారు. దాంతో మళ్లీ ఫోన్ చేసి పై అధికారులకు 20000 పంపిస్తే సరిపోవని కావున ఇంకా 20వేల రూపాయలు వెంటనే పంపిస్తే మీ ఉద్యోగం కన్ఫామ్ చేస్తామని బురిడీ కొట్టించాడు.

దీంతో మహిళ వెంటనే ఇంకో రూ 20,000 గూగుల్ పే ద్వారా పంపినట్లు తెలిపారు. మళ్లీ అదే రోజు రాత్రికి ఫోన్ చేసి ఇంకా 30000 పంపిస్తే ప్రభుత్వంకు డిడి తీసి పంపించాల్సి ఉంటుంది కావున 30000 వెంటనే పంపాలని డిమాండ్ చేశారు.

ఈ విషయం నజియా సుల్తానా తన స్నేహితులతో పంచుకోగా, తాను మోసపోయానని గమనించి లబోదిబోమటున్నారు. దీంతో బాధితురాలు ఏకంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే ఎలా మోసం జరుగుతున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం పై బాధితురాలు ఆవేదన వ్యక్తంచేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments