HomeCRIMEమద్యం మత్తులో డయల్ 100 కి ఫోన్ ...రెండు రోజుల జైలు .....

మద్యం మత్తులో డయల్ 100 కి ఫోన్ …రెండు రోజుల జైలు …..

మద్యం మత్తులో డయల్ 100 ఫోన్ చేసి గలాటా సృష్టిస్తున్న వ్యక్తి కి కోర్టు రెండు రోజుల జైలు శిక్ష ను విధించింది.వివరాల్లోకి వెళితే నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బినోల గ్రామానికి చెందిన బోసి హన్మాండ్లు శుక్రవారం మద్యం తాగి 100 డయల్ చేసి పదే పదే తప్పుడు సమాచారం ఇచ్చారు తో స్థానిక పోలీసు లు వెళ్ళి అరా తీయడంతో అతను తాగి ఉన్నాడు నిర్దారించుకున్నారు.

కుటుంబ సభ్యులకు అప్పగించగా అయిన కూడా పదే పదే డయల్ 100 కాల్ చేసి న్యుసెన్స్ చేస్తుండడంతో అతని పై కేసు నమోదు చేసి, ఈరోజు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా విచారించిన మెజిస్ట్రేట్ గారు హన్మండ్లు అను వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష విధించారు.

డయల్ 100 అనేది అత్యవసర పరిస్థితుల్లో వాడాలి అంతే కానీ కొంత మంది దానిని తాగిన మత్తులో, అనవసరంగా 100 డయల్ కి ఫోన్ చేస్తూ దానిని దుర్వినియోగం చేస్తున్నారు, అలా ఎవరైనా డయల్ 100 ని దుర్వినియోగం చేస్తే వారి పై చట్టపరమైన చర్యలుంటాయని నవీపేట్ ఎస్సై హెచ్చరించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments