ఈరోజు కాంగ్రెస్ భవన్ నందు కాంగ్రెస్ పార్టీ జాతీయ అగ్ర నాయకురాలు తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారి 78వ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ భవన్ నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన కేక్ కట్ చేసి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది.
అనంతరం రెడ్ క్రాస్ నందు nsui జిల్లా అధ్యక్షులు వేణు రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో ఉన్నతమైన ఆశయాలను దేశానికి ఉన్నతమైన సంస్కృతిని అందించిన వ్యక్తులలో సోనియా గాంధీ గారు ముందుంటారని, అదేవిధంగా గెలుపు ఓటములను సమానంగా తీసుకొని అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రతిరోజు దేశ అభివృద్ధి కోసం దేశ ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి సోనియాగాంధీ గారు అని, కాంగ్రెస్ పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టి దేశంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ప్రభుత్వం ఏర్పడడానికి సోనియా గాంధీ గారు ఎంతో కృషి చేశారని ఆయన అన్నారు.
అదేవిధంగా తెలంగాణ ప్రజలు కృతజ్ఞతా భావంతో ఉండాల్సి వస్తే సోనియాగాంధీ గారికి ఉండాలని ఎందుకంటే 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగులు అమరవీరుల త్యాగాలను గుర్తించిన సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అందుకు ఆమెకు తెలంగాణ ప్రజల తరఫున మాణాల మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.
దేశ ప్రజల కోసం దేశం కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి సోనియా గాంధీ గారిని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంచాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరొక్కసారి సోనియాగాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నుడా చైర్మన్ కేశవేణు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతా రెడ్డి రాజారెడ్డి ,ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రమ్, మాజీ బీసీ సెల్ అధ్యక్షులు శేఖర్ గౌడ్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ ,జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణు రాజ్, మాజీ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, జిల్లా ఫిషర్ మ్యాన్ చైర్మన్ శ్రీనివాస్, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్ ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఈసా, నగర ఎస్సీ అధ్యక్షులు వినయ్ ,నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, నగర మైనారిటీ అధ్యక్షులు ఎజాజ్, జగడం సుమన్, లవంగ ప్రమోద్, సకినాల శివకుమార్, మహిళా కాంగ్రెస్ నాయకులు తంబాకు చంద్రకళ, పోల ఉష, కోనేరు విజయలక్ష్మి, ఆశాబి, గాజుల సుజాత, ఆకుల సుజాత, మలైకా బేగం, విజయ రాణి, అపర్ణ, స్వామి గౌడ్, సంఘం సాయిలు, నర్సింగ్ రావు మరియు తదితరులు పాల్గొన్నారు. కృతజ్ఞతలతో ఎస్ లక్ష్మణ్ పిఆర్ఓ జిల్లా కాంగ్రెస్ కమిటీ నిజామాబాద్
