రేవంత్ సర్కార్ ప్రజా పాలన పేరుతో విజయోత్సవాలను ఎందుకు జరుపుతుందని విద్యావ్యవస్థ ను నాశనం చేసినందుకేనా ఎస్ ఎఫ్ ఐ నేత రాచకొండ విగ్నేష్ ఎద్దేవాచేశారు ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం అన్ని రంగాలను అభివృద్ధి చేసిందా అంటే ఏమి చేయలేదని స్పష్టంగా కనపడుతుంది.
గత టిఆర్ఎస్ పాలనలో విద్య రంగం నిర్వీర్యం అవుతే నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా విద్యకు ప్రాధాన్యత దక్కుతుందని భావించామని కానీ ప్రజాపాలన ప్రభుత్వం అటువైపుగా అడుగులు వేయకుండా *పెనం నుండి పొయ్యిలో పడ్డట్టు అన్న చందంగా పాలన కొనసాగిస్తుందన్నారు.
అద్దె భవనాలలో నడుస్తున్న సంక్షేమ హాస్టళ్లకు తాళాలు వేయడం, ఆశ్రమ పాఠశాలలో, కేజీబీవీ లలో, గురుకులాలలో వరుస ఫుడ్ పాయిజన్ సంఘటనలు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో కారం మెతుకులు, విద్యార్థుల ఆత్మహత్యలు ఇలాంటి ఘటనలు ప్రజా పాలనలో అనేకం దీనికేనా విజయోత్సవాలు అని మేధావులు ప్రశ్నిస్తున్నారు.
విద్యా వ్యవస్థను అభివృద్ది చేయడానికి నయాపైసా ఖర్చు పెట్టకుండా విజయోత్సవాల పేరుతో కోట్ల రూపాయలను దుబారగా ఖర్చు చేస్తే విద్యారంగం అభివృద్ధి కాదని ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రాన్ని విద్యారంగాన్ని రోల్ మోడల్ గా నిలబెట్టి ఈ విజయోత్సవాలను జరిపితే బాగుండు అని విద్యావేత్తలు ప్రభుత్వానికి సూచనలను చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు .
