నిజామాబాద్ జిల్లా లో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని పి.డి.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు.సోమవారం తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు ప్ల కార్డ్స్ ప్రదర్శిస్తూ పి.డి.ఎస్.యూ ఆద్వర్యంలో నిరసన వ్యక్తం చేసారు.ఈ సందర్భంగా జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ గత కొన్ని ఏండ్లుగా నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్న గాని పాలకులు పట్టించుకోవడంలేదని ,ఎన్నికల సమయంలో హామీలు ఇస్తున్నారు గాని కానీ అధికారంలో వచ్చిన తర్వాత అమలు చేయడం లేదని, ఇంజనీరింగ్ విద్య కోసం విద్యార్థులు హైదరాబాదు వెళ్లి చదువుకోవలసి వస్తుందని లక్షల రూపాయలు అదనపు భారం విద్యార్థుల పైన భారం పడుతుందని, దూరం ఉండటం వలన పేద విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకు దూరం అవుతున్నారని,మన దగ్గర యూనివర్సిటీ ఉండి కూడా ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయకపోవడం పాలకుల చిత్తశుద్ధికి నిదర్శనం అని, ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తే నాలుగు జిల్లాల విద్యార్థులకు ఉపయోగపడుతుందని,,జిల్లాలో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో మాట్లాడి నిజామాబాద్ జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ పి.డి.ఎస్.యూ నాయకులు అక్షయ్,నిఖిల్,బిందు, రాకేశ్,రాజేందర్,రవీందర్, బీమేశ్,కార్తీక్,శ్రీజ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలి ..అసెంబ్లీ లో ఇంజనీరింగ్ కళాశాలపై జిల్లా ప్రజా ప్రతినిధులు మాట్లాడాలి – పి.డి.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు
RELATED ARTICLES
