తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అభివృద్ధి అధికారం లేవని కేవలం అవమానాలతోనే కాలం వెల్లడిస్తున్నామని ఎమ్మెల్యే లుగా ఎన్నికయిన తమకు నియోజకవర్గాల్లో కనీసం మర్యాద దక్కడం లేదని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు సోమవారం అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు సభ లో తొలత తెలంగాణ తల్లి విగ్రహ నమూనా ఫై సీఎం రేవంత్ చేసిన ప్రకటన మీద అన్ని పక్షాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో కామారెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే లు వెంకట్రామ్ రెడ్డి పైడి రాకేష్ రెడ్డి లు ప్రోటోకాల్ అంశం ను ప్రస్తావించారు. తాము ఎమ్మెల్యే లుగా గెలిచినా సరే నియోజకవర్గాల్లో కనీసం మర్యాద దక్కడం లేదని పైగా అవమానాలు ఎదుర్కొంటున్నామని తమకు ఎమ్మెల్యే లుగా గుర్తింపు కార్డు ఇచ్చారు కానీ ఆ హోదా ఎందుకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. తమపట్ల హక్కుల ఉల్లఘన జరుగున్నాయని స్పీకర్ కార్యాలయాల్లోనూ పిర్యాదు చేశామన్నారు.
తాము మంత్రులకు ఎంతో గౌరవం ఇస్తున్నామని కానీ మాకెందుకు ఆ గౌరవరం ఇవ్వలేక పోతున్నారని ప్రశ్నించారు. దీనిపై స్పీకర్ మాట్లాడుతూ ఇలాంటి వ్యవహారాలను తాను సీరియస్ తీసుకుంటానని ఒకటి రెండు రోజుల్లో సభ వ్యవహారాల మంత్రిని ఛాంబర్ కు పిలిచి మీ సమక్షంలోనే మాటాడుతానని స్పీకర్ హామీ ఇచ్చారు.
అప్పుల తెలంగాణ చిహ్నం గా ఉంది
తెలంగాణ తల్లి కొత్త విగ్రహ నమూనా లో కొన్ని మార్పులు చేస్తే మరింత బాగుంటుందని రాకేష్ రెడ్డి అన్నారు గతంలో ఉన్న ధనిక రాష్త్రం గా తెలంగాణ ఉండేదని అప్పుడు విగ్రహం కూడా అలాగే ఉండేదని ఇప్పుడు తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని విగ్రహం కూడా అలాగే వుందని విగ్రహం అభయహస్త వుండడం వల్ల కాంగ్రెస్ విగ్రహం వుందని రిక్త హస్తం కన్న చేతిలో బతుకమ్మ వుంటే బాగుంటుందని రాకేష్ రెడ్డి సూచించారు
