HomeTelanganaNizamabadజోగిని మహిళల సమస్యలపై ఉద్యమిస్తాం బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సబ్బని లత

జోగిని మహిళల సమస్యలపై ఉద్యమిస్తాం బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సబ్బని లత

వేల సంవత్సరాల క్రితం గ్రామీణ ప్రాంతాల్లో జోగిని దురాచార వ్యవస్థకు కారణమైన భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా అనేక మంది సంఘసంస్కర్తల పోరాటం వల్లనే ప్రభుత్వాలు స్పందించి జోగిని దురాచార వ్యవస్థను నిషేధిస్తూ చట్టం చేశారని బహుజన లెఫ్ట్ పార్టీ( బహుజన కమ్యూనిస్టు) బిఎల్పి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సబ్బని లత వెల్లడించారు.

ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ వద్ద జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో వర్ని కేంద్రంగా హేమలత లవనం, చెల్లి నిలయం రాజయ్య లాంటి వారు చేసిన కృషి వల్ల ఉమ్మడి రాష్ట్రంలో జోగిని దురాచార వ్యవస్థ నిర్మూలించినా ఆ దురాచారానికి బలైపోయిన మహిళలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సైతం ఎలాంటి సహాకారానికి నోచుకోలేదని బహుజన లెఫ్ట్ పార్టీ (బహుజన కమ్యూనిస్టు)బిఎల్పి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సబ్బని లత ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ పార్టీ (బహుజన కమ్యూనిస్టు) బిఎల్పి రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్, చెల్లి నిలయం వ్యవస్థాపకులు వర్ని రాజయ్య , బిఎల్ టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, న్యాయవాది కిరణ్,ఆర్గనైజర్ రెడ్డి సాయిలు ,గంగమణి, శెషైల సాయమ్మ, నాగరాజ్ లతోపాటు నవీపేట, నంది పేట, బీంగల్,కమ్మర్ పల్లి , మోర్తాడ్, బోధన్, వర్ని, రెంజల్ మండలాలకు చెందిన జోగిని మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments