HomeTelanganaNizamabadకవిత గ్రాండ్‌ ఎంట్రీ కి ఎట్టకేలకు కుదిరిన ముహూర్తం .........దాదాపు ఏడాది తర్వాత జిల్లాకు .......ఎమ్మెల్సీ...

కవిత గ్రాండ్‌ ఎంట్రీ కి ఎట్టకేలకు కుదిరిన ముహూర్తం ………దాదాపు ఏడాది తర్వాత జిల్లాకు …….ఎమ్మెల్సీ గా ఉన్నా హైదారాబాద్ కే పరిమితం …….భారీజనసమీకరణ కు బిఆర్‌ యస్‌ ప్లాన్‌ ……రంగంలోకి జాగృతి టీమ్ …. హై అలర్ట్ లో మాజీలు..

ఎమ్మెల్సీ కవిత తాను ప్రాతినిధ్యం నిజామాబాద్ జిల్లాలో అడుగు పెట్టబోతున్నారు. క్యాడర్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆమె ఎంట్రీ కి ఎట్టకేలకు ముహూర్తం ఖరారు అయింది.ఆదివారం ఆమె జిల్లాకు వస్తున్నట్లు పార్టీవర్గాలు చెప్తున్నాయి.ఈ మేరకు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు.మాజీ ఎమ్మెల్యే లు స్వయంగా రంగంలోకి దిగారు ఆమె పర్యటన ను గతంలో ఎప్పుడు లేనంత ప్రాధాన్యత గా తీసుకున్నారు.భారీఎత్తున ప్రజలను తరలించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. దాదాపు ఏడాది తర్వాత నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కవిత మెట్టినింట అడుగుపెట్టబోతుండడం తో క్యాడర్ లోనూ ఉత్సహం కనిపిస్తుంది . ఢిల్లీ లిక్కర్‌ కేసు జైలు కు వెళ్లిన ఆమె అయిదు నెలల తర్వాత బెయిల్ మీద వచ్చారు. దాదాపు రెండు మసాలా పాటు అనారోగ్యం పేరుతొ వ్యూహాత్మకంగా అజ్ఞాతంలో ఉన్నారు.ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఇప్పుడిప్పుడే పార్టీలో క్రియాశీలం అవుతున్నారు.మొన్నటిదాకా హైదారాబాద్ కు పరిమితం అవుతూ వచ్చిన కవిత ఈ మద్యే జగిత్యాల్ జిల్లాకు వెళ్లారు.మొదట ఆమె నిజామాబాద్ జిల్లా నుంచే రాజకీయ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టాలని భావించారు. నెల 29న దీక్షా దివాస్‌ నే వేదిక ను ఖరారు చేసారు.పార్టీ ఆఫీస్ లో జరిగే ఈ దీక్ష కు భారీఎత్తున క్యాడర్ ను తరలించడానికి ఏర్పాట్లు కూడా చేసారు . గతంలో స్థానిక ఎమ్మెల్యే ల కారణంగా దూరం అయిన నేతలు మరోసారి కవిత కు చేరువ కావడానికి సిద్ధం అయ్యారు. ప్రభుత్వం ఏడాది పాలనా ఉత్సవాలను ఘనంగా జరుపుతున్న నేసథ్యం లో బిఆర్ యస్ సైతం దీక్షా దివస్ సక్సెస్ కోసం సర్వశక్తులే ఒడ్డింది. అందుకే ఇదే వేదికగా కవిత ఎంట్రీ వుంటే సూపర్ హిట్ అవుతామనేది కవిత టీమ్ ఆలోచనగా ఉండే. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత యేడాది కాలంగా తాము ప్రాతినిధ్యం వహించిన సెగ్మెంట్ లకు మొఖం చాటేసిన మాజీ ఎమ్మెల్యే లు కవిత టూర్ సక్సెస్ కోసం ఖచ్చితంగా చెమటోడ్చే పరిస్థితి ఉండే . క్షేత్ర స్థాయిలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కనీసం క్యాడర్‌ ను సమీకరించడమే దుస్సాధ్యంగా భావించారు .కానీ అనూహ్యంగా ఎమ్మెల్సీ కవిత ఈ దీక్షా కు రావడం లేదని సమాచారం రావడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు నెల రోజుల తర్వాత మరోసారి ఆమె జిల్లా టూర్ ఖరారు కావడంతో మాజీ ల్లో మళ్ళీ అదే టెన్షన్ మొదలైంది. ఈసారి పార్టీ వ్యవహారాల్లో కవిత మరింత అగ్రసివ్‌ గా వుంటారని ప్రచారం జరుగుతున్ననేపథ్యంలో మాజీ లు ఆమె టూర్ విషయంలో మునుపటిలా లైట్ తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments