జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల కేసులు కలిపి గతేడాది కంటే స్వల్పంగా నేరాల శాతం పెరిగిందని ఇన్చార్జి సీపీ సింధు శర్మ ఆదివారం తెలిపారు. వీటిలో 2023 సంవత్సరంలో 8635 కేసులు నమోదు కాగా 2024 లో 8745 కేసులు నమోదు అయ్యినట్లు తెలిపారు. 2023లో 980 మరియు 2022లో 918 కేసులు నమోదయ్యాయి.
గత ఏడాదితో పోల్చితే 2024లో నేరపూరిత నరహత్య 42, కిడ్నాప్ లు 57,అత్యాచారం 77 కేసులు మరియు గాయపరచడం వంటి అంశాల కింద నమోదైన కేసులు స్వల్పంగా పెరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది దోపిడీ కేసుల డిటెక్షన్ పెరిగిందనీ.
ఆస్తి నేరాల్లో ఫిర్యాదుదారుల సంఖ్య కొద్దిగా పెరిగింది మరియు ఆస్తి నేరాల గుర్తింపు కూడా పెరిగిందనీ తెలిపారు.అతివలపై తగ్గిన హింసలు..2023తో పోల్చితే మహిళలపై నేరాల్లో 15 కేసులు తగ్గాయనీ తెలిపారు.ఎటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు, యువతుల రక్షణకు చట్టాలను పకడ్బం దీగా అమలు చేయడంతో హింసలు తగ్గాయని తెలిపారు.
2024 లోవరకట్న వేధింపులతో మరణాలు 3 కేసులు నమోదయ్యాయి. వరకట్న వేధింపుకే సులు 326 నమోదయ్యాయి. 2023 సంవత్సరంతో పోల్చితే పొక్సో చట్టం కేసుల్లో 34 కేసులు పెరిగాయి. 2024 లో 115 పొక్సో కేసులు నమోదయ్యాయి.రోడ్డు ప్రమాదాలు ఆందోళనకరం…మీదుగా కీలకమైన జాతీయ, రాష్ట్ర రహదారులు వెళుతున్నాయి.
నిత్యం వాహనాలు, ప్రయాణికులతో రద్దీగా ఉంటున్నాయి. వాహనదారులు నిబంధనలు పాటించకపోవడం, మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, శిరస్త్రాణం ధరించకపోవడం, అపసవ్య దిశలో వెళ్లడం తదితర కారణాలతో జిల్లాలోని ప్రధాన దారులు నిత్యం నెత్తురోడుతున్నాయి. 2024 లో మొత్తం రోడ్డు ప్రమాదాలు 322 కేసులు నమోదయ్యాయి.
అందులో 335 మంది మృతి చెందారు.758 మంది రోడ్డు ప్రమాదాల ద్వారా గాయపడ్డారు. అలాగే 2023తో పోలిస్తే 2024 సంవత్సరానికి డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జైలు శిక్షలో 151 కేసులు పెరిగాయి. 2024 లో 3,04,914 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం రూ 11,40,66,400 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.2024 లో డ్రంకెన్ డ్రైవ్ ద్వారా 165 మందికి జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
2023తో పోలిస్తే పీడీఎస్ బియ్యం రిపోర్టింగ్‌లో 25 కేసులు పెరిగాయి.2024లో 81 కేసులలో, 110 మందిని పట్టుకున్నట్లు తెలిపారు. 7259.25 క్వింటాళ్లు పట్టుకొని 1,35,03,143/-విలువ గల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.153 ఎక్సైజ్ కేసుల్లో రూ.21,69,250.00/- విలువైన 4438.855 లీటర్ల మద్యం, 8 ఎన్‌డిపిఎస్ కేసులు నమోదు చేసి 7.196 కిలోల గంజాయి, 0.2719 కిలోల అల్ప్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. 4,51,800/-, మరియు పైన పేర్కొన్న ఎన్నికల వ్యవధిలో రూ. 1,62,43,176/- మొత్తం నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.కొందరూ అత్యాశను సైబర్ నేరగాళ్లు అనుకూలంగా మార్పు కుంటున్నారు.
నకిలీ లింకులు పంపుతూ.. ఓటీపీ చెప్పమని నమ్మపలుకుతూ.. ప్రజల సొమ్మును ఖాతాల్లోంచి దోచేస్తు న్నారు. ప్రజలు సైబర్ మోసాల బారిన పడకుండా పోలీసు శాఖ ‘సైబర్ జాగరూకత దివస్’ పేరిట అవగాహన కార్యక్ర మాలు నిర్వహిస్తున్నప్పటికీ..
బాధితుల సంఖ్య రోజురోజుకుపెరుగుతూనే ఉండటం గతేడాది 294 సైబర్ కేసులు నమోదు కాగా.. ఈ సంవత్సరం 376 కేసులు నమోదయ్యాయి. 2023తో పోలిస్తే వైట్ కాలర్ నేరాల్లో 82 కేసులు (12.40%) పెరిగాయనీ తెలిపారు.
